ఈటల ఔట్​… కొత్త వైద్యారోగ్య శాఖ మంత్రి ఈయనే..!

by Anukaran |
ఈటల ఔట్​… కొత్త వైద్యారోగ్య శాఖ మంత్రి ఈయనే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్​కు ఉద్వాసన ఖరారైంది. ఆయన పరిధిలోని వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్​కు బదిలీ చేస్తూ గవర్నర్​ ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం కేబినెట్​లో ఏ శాఖ లేని మంత్రిగా ఈటల రాజేందర్​ ఉన్నారు. ఆయన్ను ఇంకా కేబినెట్​ నుంచి బర్తరఫ్​ చేయలేదు. కాగా వైద్యారోగ్య శాఖకు కొత్త మంత్రిగా జడ్చర్ల ఎమ్మెల్యే డా. చర్లకోల లక్ష్మారెడ్డికి అవకాశం రానున్నట్లు సమాచారం.

త్వరలోనే ప్రగతిభవన్​ నుంచి ప్రకటన వస్తుందని సమాచారం. ఇప్పటికే లక్ష్మారెడ్డికి ప్రగతిభవన్​ నుంచి సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఆయన్ను ప్రగతిభవన్​కు రావాలని సూచించినట్లు సమాచారం. గతంలో ఆయన వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో తాటికొండ రాజయ్యను కేబినెట్​ నుంచి బర్తరఫ్​ చేసిన తర్వాత ఆ శాఖను లక్ష్మారెడ్డికి అప్పగించారు. రెండోసారి టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కానీ ఇప్పుడు అనూహ్య పరిస్థితుల్లో ఆయనకే మళ్లీ వైద్యారోగ్య శాఖను అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed