మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్..?

by Shyam |   ( Updated:2021-12-06 01:37:24.0  )
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్..?
X

దిశ, సినిమా : శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు సమయం పెరిగేకొద్ది సమస్యలు వచ్చిపడుతూనే ఉన్నాయి. రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌ కేసులో బెనిఫిషియరీస్‌లో ఒకరిగా ఉన్న జాక్వెలిన్‌ను ఇండియా వదిలివెళ్లరాదని అధికారులు సూచించారు. ఈ క్రమంలోనే ఆదివారం ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న తనను ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు.

అయితే త్వరలోనే జాక్వెలిన్‌ను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుండగా.. తన క్లోజ్ ఫ్రెండ్, గురువు సల్మాన్ ఖాన్ కూడా ఆమెకు సహాయం చేసేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఎప్పుడూ తన చుట్టూ ఉండే సన్నిహితులు, స్నేహితులు సైతం దీనిపై మాట్లాడేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపించకపోగా.. ఇప్పటికే అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని తన కోస్టార్ వెల్లడించగా.. జాక్వెలిన్ స్వీట్ పర్సన్ అని, ఆమె ఎప్పుడూ మంచి జీవితాన్నే కోరుకుంటుందని తెలిపారు.

కత్రినా పెళ్లి వీడియో లీక్.. ఎంత అందంగా ఉందో!

Advertisement

Next Story