- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమ్మెకు సిద్ధంకండీ.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపు
దిశ, తాండూర్: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఆ సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గోలేటిలోని ఏఐటీయూసీ కార్యాలయంలో శుక్రవారం సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజాబాబు, సీఐటీయూ ఏరియా కార్యదర్శి అంబాల ఓదెలు, ఇఫ్టూ ఏరియా అధ్యక్షుడు తిరుపతి, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మణిరాంసింగ్ మాట్లాడుతూ.. ఎన్టీపీసీతో సహా సింగరేణిలో అన్ని విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు, జీవో నంబర్ 22 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. సింగరేణి యాజమాన్యానికి ఇచ్చిన సమ్మె నోటీసుల్లో 18 డిమాండ్లు ఉన్నాయని, వాటిని వెంటనే అమలు చేయాలన్నారు. డిసెంబర్ 26న గోదావరిఖనిలో జరిగే పోరుగర్జన సభను అందరూ విజయవంతం చేయాలని కోరారు.