ఫన్నీగా ‘జాతి రత్నాలు’ టీజర్

by Jakkula Samataha |   ( Updated:2024-06-02 15:18:50.0  )
ఫన్నీగా ‘జాతి రత్నాలు’ టీజర్
X

దిశ, వెబ్‌డెస్క్: థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కిన మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఈ సినిమాలో యువ న‌టుడు న‌వీన్ పొలిశెట్టి తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలందుకున్నారు. త‌న‌దైన యాక్టింగ్ స్టైల్‌తో..క్యారెక్టర్‌కు ఫన్ యాడ్ చేస్తూ అంద‌రినీ అల‌రించిన నవీన్.. ప్రజెంట్ ‘జాతి ర‌త్నాలు’ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. న‌వీన్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మూవీ యూనిట్ ఆదివారం విడుదల చేసిన టీజర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. చిత్రంలో నవీన్..జోగిపేట్ శ్రీకాంత్ అనే ఖైదీ పాత్ర చేస్తున్నాడు.‘మీ ఖాకీబ‌ట్టలు, తుపాకీ గుండ్లు మా నోళ్లు నొక్కలేవు..ఇన్‌స్పెక్టర్’ అంటూ న‌వీన్ పొలిశెట్టి చెబుతున్న డైలాగ్స్ ఫ‌న్నీగా సాగుతున్నాయి.

Advertisement

Next Story