ఐదో రోజుకు చేరిన రైతుల ధర్నా.. న్యాయం చేస్తామన్న తహసిల్దార్

by Shyam |   ( Updated:2021-12-07 03:03:13.0  )
ఐదో రోజుకు చేరిన రైతుల ధర్నా.. న్యాయం చేస్తామన్న తహసిల్దార్
X

దిశ, వీపనగండ్ల: ఆక్రమణకు గురైన తమ భూమి తమకు ఇప్పించాలని గోపాల్ దిన్నె గ్రామ దళితులు సర్పంచ్ కార్యాలయం ఎదుట కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. తమకు ఇచ్చిన అసైన్డ్ భూమిని రంగ వరం గ్రామ రైతులు ఆక్రమించుకున్నారని, దానిని తిరిగి తమకు ఇప్పించాలని కోరుతూ వారు ఈ ధర్నా ప్రారంభించారు. మంగళవారానికి ఈ ధర్నా ప్రారంభమై ఐదు రోజులు అయ్యాయి. సర్వే నెంబర్ 357 లో తమకు అసైన్డ్ భూమి ఉందని, దాన్ని రంగవరం గ్రామానికి చెందిన రైతులు ఆక్రమించుకొని తమను రానివ్వడం లేదని గోపాల్ దిన్నె గ్రామ రైతులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు నాగరాజు మంద నరసింహ మాట్లాడుతూ.. మా దళితుల భూమి మాకు దక్కే వరకు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ విషయంపై తహసిల్దార్ యేసయ్యను వివరణ కోరగా మోక పైకి అధికారులు వెళ్లగా రెండు గ్రామాల రైతులు గొడవకు దిగుతున్నారని, ఇరు గ్రామాల రైతులు సహకరిస్తే అందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed