- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐటీసీ నుంచి కూరగాయలను శుభ్రం చేసే 'నీమ్‌వాష్'!
దిశ,సెంట్రల్ డెస్క్: ఎఫ్ఎమ్‌సీజీ దిగ్గజం ఇటీవల కూరగాయలను, పండ్లను శుభ్రం చేయడానికి అవసరమైన నీమ్‌వాష్ ప్రోడక్ట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కరోనా వ్యాధి సంక్రమణ నేపథ్యంలో వినియోగదారులు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందున ఈ ఉత్పత్తిని తీసుకొచ్చామని ఐటీసీ పేర్కొంది. వినియోగదారుల ఆందోళనలను పోగొట్టేందుకు 100 శాతం ప్రకృతి సహజసిద్ధమైన పదార్థాలను కలిగిన నీమ్‌వాష్‌ను ప్రవేశపెట్టినట్టు వెల్లడించింది. ఈ ప్రోడక్ట్ కూరగాయలు, పండ్లపై ఉన్న క్రిములను 99.9 శాతం సమర్థవంతంగా తొలగిస్తుందని కంపెనీ పేర్కొంది. వేప, సిట్రస్ పండ్ల మూలకాలతో ఉన్న ఇది ఎంతో సురక్షితమైనదని, అంతేకాకుండా క్లోరిన్, బ్లీచ్ వంటి కృత్రిమ రంగులను ఇందులో వాడలేదని స్పష్టం చేసింది. స్ప్రే అండ్ వాష్, సోక్ అండ్ వాష్ రెండు వేరియంట్లలో దీన్ని మార్కెట్లోకి తెస్తున్నామని ఐటీసీ తెలిపింది.
నీమ్‌వాష్ 450మి.లీ., 500 మి.లీ లీటర్ల ప్యాక్‌లలో లభించనుంది. నీమ్‌వాష్ సోక్ అండ్ వాష్ 500 మి.లీ ధర రూ. 99కే అందుబాటులో ఉంది. సోక్ అండ్ వాష్ 1 లీ ధర రూ. 190కి అందుబాటులో ఉంది. స్ప్రే అండ్ వాష్ 450 మి.లీ ప్యాక్ రూ. 130 కే అందుబాటులో ఉంది. ఏప్రిల్ నెలలో మారికో లిమిటెడ్ వెజీ క్లీన్ పేరుతో పండ్లు, కూరగాయలను శుభ్రం చేసే ప్రోడక్ట్‌ను తెచ్చిన విషయం తెలిసిందే.