‘దేవుడు కోరితేనే సాధువులను చంపేశా’

by Sumithra |
‘దేవుడు కోరితేనే సాధువులను చంపేశా’
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహార్‌లో ఇద్దరు సాధువులను హత్య చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ హత్యలో నిందితుడు మురారీ అలియాస్ రాజును అదుపులోకి తీసుకుని విచారించగా, మత్తులో ఉన్న నిందితుడు.. ‘దేవుడు కోరినందునే సాధువులను చంపేశాను’ అని సమాధానం చెప్పాడు. మొదట షాక్‌కు గురైన పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నాడు. పగోనా గ్రామ శివాలయంలో నిద్రిస్తున్న సాధువులు జగన్‌దాస్ (55) సేవా దాస్(35)లతో రెండు రోజుల క్రితం గొడవైందనీ, ఆ కోపంతోనే చంపేశానని వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రాజును అరెస్ట్ చేశారు.

యోగికి ఉద్ధవ్ ఫోన్

ఇదిలా ఉండగా, సాధువుల మృతి నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇదే నెల 16న మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోనూ సాధువులను దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉద్దవ్‌కు యోగి కూడా ఫోన్ చేశారు.

Tags: up, bulandshahr, god’s will, sadhus killed, udhav thakre, yogi adityanath, up cm, palghar incident,

Advertisement

Next Story

Most Viewed