- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీఎంకే స్టాలిన్ అల్లుడి నివాసంలో ఐటీ రైడ్స్
చెన్నై: డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడు శబరీశన్ నివాసంలో ఆదాయ పన్ను శాఖ తనిఖీలు చేస్తున్నది. ఈ రోజు ఉదయం 8 గంటలకు సోదాలు మొదలయ్యాయి. చెన్నై నగరానికి సమీపంలోని నీలాంగరాయ్‌లోని శబరీశన్ నివాసం, ఆయనకు చెందిన మరో నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నది. ఎన్నికల క్యాంపెయిన్ కోసం నగదు రవాణా సమాచారం అందిందని, ఆ ఇన్‌పుట్లతోనే శబరీశన్ నివాసంలో రైడ్స్ నిర్వహిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. శబరీశన్‌కు మద్దతుగా డీఎంకే నేతలు, కార్యకర్తలు ఆయన నివాసం ఎదుటకు చేరారు. డీఎంకే నేతలపై దాడులు జరగడం ఇది రెండోసారి. గతనెలలో డీఎంకే నేత ఈవీ వేలు ఆస్తులపైనా దాడులు జరిగాయి. ఈ నెల 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోదాలు జరగడం చర్చనీయాంశమైంది.
అమిత్ షా తనయుడు జయ్ షా ఆస్తులు వేగంగా పోగవడాన్ని స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఓ ర్యాలీలో ప్రశ్నించిన తర్వాతి రోజే ఐటీ రైడ్లు జరగడం గమనార్హం. కాగా, స్టాలిన్ శిబిరంలో శబరీశన్ ప్రభావవంతమైన నేతగా పేరున్నవారు. మిత్రులనైనా, శత్రువులతోనైనా సమావేశాలను నిర్వహించి అనుకూలంగా మార్చడం దిట్ట అని చెబుతుంటారు. ఈ భేటీలకు కావల్సిన వనరులనూ ఆయన ఏర్పాటు చేస్తుంటారని సమాచారం.