రాష్ట్రమంతా ఒక వైపు.. కానీ జగన్ మనసు కరగలేదు.. సోమిరెడ్డి ఫైర్

by  |   ( Updated:2021-12-18 06:23:07.0  )
tdp somi reddy
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతిలో అమరావతి సభ చరిత్ర సృష్టించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో మహాపాదయాత్ర ముగింపు సభ విజయవంతమైందని చెప్పుకొచ్చారు. అకుంఠితదీక్షతో చేపట్టిన మహాపాదయాత్రను ప్రారంభం నుంచి సభ వరకు ప్రజలంతా స్వచ్ఛందంగా అండగా నిలబడ్డారని కొనియాడారు. ఒక్క వైసీపీ తప్ప రాష్ట్రంలోని అన్ని పార్టీలు, యువజన, కార్మిక, రైతు, ప్రజా సంఘాలన్నీ రాజధాని రైతులకు జైకొట్టారని వ్యాఖ్యానించారు.

అధికార వైసీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా, ఎన్ని కేసులు బనాయించినా, ఆటంకాలు సృష్టించినా భగవంతుడితో పాటు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మహా పాదయాత్ర విజయవంతమైందన్నారు. కేంద్రంలో అత్యంత బలీయమైన శక్తిగా ఉన్న బీజేపీ ప్రభుత్వమే రైతుల పోరాటానికి తలొగ్గి మూడు కీలక బిల్లులను వెనక్కి తీసుకుందని అయితే అమరావతి రైతులు, మహిళలు ఇంతలా పోరాటం చేస్తున్న సీఎం జగన్ మనసు కరగకపోవడం దురదృష్టకరమన్నారు. అమరావతి రైతులు తలపెట్టిన ఉద్యమాన్ని గౌరవించాల్సింది పోయి… పోటీగా వికేంద్రీకరణ సభ పెట్టిస్తారా అంటూ మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలకు మంచి పాలన అందించడంలో విఫలమైన సీఎం జగన్ ఇకనైనా కళ్లు తెరవాలన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని లేకపోతే ప్రజలు క్షమించరంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Next Story