యువతకు ఐటీ హబ్ ఓ ఆశాదీపం

by Shyam |   ( Updated:2020-12-02 05:06:29.0  )
యువతకు ఐటీ హబ్ ఓ ఆశాదీపం
X

దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం యువతకు ఐటీ హబ్ ఓ ఆశాదీపం అని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. యువతకు ఉపాధి కల్పన కోసం ఐటీ హబ్‌ను నిర్మించామని ఆయన అన్నారు. శంకుస్థాపన రోజే పది కంపెనీలతో ఎంవోయూ చేసుకున్నట్టు తెలిపారు. కేటీఆర్ చేతుల మీదుగా ఫేజ్-2 కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. యువతకు శిక్షణ కల్పించి నైపుణ్యాలు పెంచి అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని చెప్పారు. ఖమ్మం ఐటీ హబ్‌లో 16 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తాయని చెప్పారు. కేటీఆర్ సహకారంతో బాలారిష్టాలు అన్ని తట్టుకుని ఐటీ హబ్ నిర్మించామని చెప్పారు.

Advertisement

Next Story