- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్ డౌన్ వేళ.. అత్యవసరాలకు డిజిటల్ పాస్
దిశ వెబ్ డెస్క్: కరోనా ప్రభావంతో.. సేవలన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. రవాణా సౌకర్యాలన్నీ కూడా బంద్ అయ్యాయి. అయితే అందరకీ కాకపోయినా.. కొందరికీ అత్యవసర పనులుంటాయి. ఎక్కడికక్కడ పోలీస్ చెక్ పాయింట్లు ఉండటంతో.. వాళ్లు కాళ్లు బయటపెట్టాలంటే అనుమతి పత్రం తప్పనిసరి. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం అంత శ్రేయస్కరం కూడా కాదు. అందుకే ఇకపై అలాంటి అవసరం ఉండబోదు. లాక్ డౌన్ వేళ.. అత్యవసరాల కోసం.. డిజిటల్ పాసులు జారీ చేసేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది.
మీరు నిత్యావసర సరకులు సరఫరా చేస్తున్నారా? అత్యవసర ప్రభుత్వ ఆఫీసుల్లో మీరు విధులు నిర్వర్తిస్తున్నారా? ఏదైనా హాస్పిటల్ లో నర్సుగా సేవలు అందిస్తున్నారా? ఆసుపత్రిలో చెకప్ కోసం నిత్యం ప్రయాణించాల్సి ఉందా? అయితే లాక్ డౌన్ సమయంలో చెక్ పాయింట్ల వద్ద పోలీసులు నిత్యం పహారా కాస్తూ.. పర్మిషన్ లెటర్ చూయించాలని చెబుతారు. ఇకపై సామాన్యులతో పాటు, వివిధ ప్రభుత్వ విభాగాల సిబ్బందికి ఆన్ లైన్ లోనే డిజిటల్ పాసులు జారీ చేస్తోంది పోలీస్ శాఖ.
అప్లికేషన్ ఇలా:
పాస్ లు అవసరమైన పౌరులు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకునేందుకు వీలుగా.. www.tspolice.gov.in లో కొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నారు. వెబ్ సైట్ లోకి వెళ్లగానే లెఫ్ట్ సైడ్ పై భాగంలో.. టీ ఎస్ ఈ పాస్ .. డ్యూరింగ్ లాక్ డౌన్ అనే అప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అందులోకి లాగిన్ కాగానే.. సెల్ నంబర్ తో పాటు, సంబంధిత వివరాలు, వాటికి సంబంధించిన పత్రాలు జత చేస్తే.. విచారణ అనంతరం డిజిటల్ పాస్ జారీ చేస్తారు. మరో రెండు రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది.
Tags : police, lockdown,digital pass, login,application