పిల్లల్ని క్రాకర్స్ కాల్చొద్దనడానికి మీరెవరు.. ‘దీపావళి’ అంటే ఏంటో వారికి తెలియాలి

by Shamantha N |   ( Updated:2021-11-03 02:17:14.0  )
పిల్లల్ని క్రాకర్స్ కాల్చొద్దనడానికి మీరెవరు.. ‘దీపావళి’ అంటే ఏంటో వారికి తెలియాలి
X

దిశ, వెబ్‌డెస్క్ : దీపావళి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది క్రాకర్స్. పండుగ నాడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ టపాసులు కాలుస్తుంటారు. ఈ క్రాకర్స్ ఫైర్ చేయడం వలన శబ్ద కాలుష్యంతో పాటు వాయు కాలుష్యం పెరిగిపోతుందని ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ విధించాయి. దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయినందున ఆప్ సర్కార్ ఇప్పటికే అక్కడ క్రాకర్స్ అమ్మకాలపై నిషేధం విధించింది. టపాసు కాల్చరాదని.. ఎవరైనా క్రాకర్స్ అమ్మినా, కొనుగోలు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో ఈ ఏడాది క్రాకర్స్ వినియోగంపై నిషేధం విధించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

దీనిపై ఇషా ఫౌండేషన్ అధినేత జగ్గీవాసుదేవ్ మండిపడ్డారు. పిల్లలను క్రాకర్స్ కాల్చొద్దనడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. కాలుష్యం మీద అంత శ్రద్ధ ఉంటే మీరు ఆఫీసులకు నడుచుకుంటూ వెళ్లండని అన్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే దీపావళి పండుగ అంటే ఎంటో పిల్లలకు తెలియాలన్నారు. పిల్లల్ని పండుగ సందడి నుంచి దూరం చేయొద్దని సూచించారు. టపాసులు పేలిస్తేనే దేశంలో కాలుష్యం పెరుగుతుందని.. పొల్యూషన్ పెరగడానికి దీపావళి పండుగే కారణం కాదని స్పష్టంచేశారు. కాగా, దేశంలో కాలుష్యం పెరగకుండా ఉండేందుకు గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని, వీటి వలన కాలుష్యం పెరగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story