శ్రీదేవికి ఇషా ఘన నివాళి..

by Shyam |
శ్రీదేవికి ఇషా ఘన నివాళి..
X

అతిలోక సుందరి శ్రీదేవి స్ఫూర్తితో సినీరంగంలో అడుగుపెట్టిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. తన ఇన్‌స్పిరేషన్‌తో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు పొందిన నటుల్లో హీరోయిన్ ఇషా చావ్లా కూడా ఒకరు. అయితే, ఆగస్ట్ 13న శ్రీదేవి జయంతిని పురస్కరించుకుని ఇషా.. ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

‘మిషన్ గ్రీన్ ముంబై’ సంస్థతో కలిసి శ్రీదేవి పేరు మీద రైతులకు 101 రకాల పండ్ల మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. శ్రీదేవి మన జీవితంలో ఒక భాగం అయిపోయి ఎన్నో పాత్రలతో మెప్పించారని.. అలాగే ఈ పండ్ల చెట్లు మన జీవితంలో భాగం కావాలని కోరుకుంది. తద్వారా అటు రైతులకు ఆదాయంతో పాటు ఇటు వాతావరణ కాలుష్యం నివారించవచ్చునని, ఇదే తనకిచ్చే ఘన నివాళిగా భావిస్తున్నట్లు తెలిపింది ఇషా చావ్లా. అంతేకాదు మిషన్ గ్రీన్ ముంబై సంస్థ ద్వారా మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతామని తెలిపింది.

Advertisement

Next Story