- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల తహాశీల్దార్, డిప్యూటీ తహాశీల్దార్, సీనియర్ అసిస్టెంట్‌ల సస్పెండ్ వెనుక జిల్లా కలెక్టర్ ను తప్పుదోవ పట్టించడమే కారణమని తెలుస్తోంది. చౌటుప్పల్ మండల తహాశీల్దార్ కార్యాలయం గత కొంత కాలంగా అవినీతికి అడ్డాగా మారింది. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నుండి మొదలుకొని తహాశీల్దార్ వరకు వసూలు పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. భూ సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చిన రైతుల పట్ల నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది. సీనియర్ అసిస్టెంట్ జానయ్య చక్రం తిప్పుతూ రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుందని గత కొంతకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన భూ వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ ముందుండి నడిపించినట్లు తెలుస్తోంది.
అధికారుల సస్పెండ్ వెనుక ఏం జరిగిందంటే….?
మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని 114, 115 సర్వేనెంబర్ లోని పది ఎకరాల భూమిని ఎన్నారై పోర్టల్ ద్వారా చౌటుప్పల్ మండలం తహాశీల్దార్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. గ్రామానికి చెందిన వరకాంతం శ్రీధర్ రెడ్డి అమెరికాలో ఉంటున్నారు. అతని పేరుమీద ఉన్న భూమిని ప్రముఖ రియల్టర్ రత్నం నరసింహారెడ్డి కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం ధరణి వెబ్ సైట్ లో ఎన్నారై పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేశారు. ఈ సమయంలో భూమికి సంబంధించి నోటరీ ద్వారా జీ పీ ఎ చేసుకున్నట్లు అప్లోడ్ చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మండల తహాశీల్దార్ గిరిధర్ కు ఆదేశాలు ఇచ్చారు. తహాశీల్దార్ గిరిధర్ డిప్యూటీ తహాశీల్దార్ మమతకు, సీనియర్ అసిస్టెంట్ జానయ్య విషయం చెప్పారు. పూర్తి స్థాయి తనిఖీ చేయాల్సిన వీరు అంతా సవ్యంగానే ఉందంటూ జిల్లా కలెక్టర్ ను తప్పుదోవ పట్టించే విధంగా నివేదిక ఇచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్ చేయొచ్చని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఎన్నారై పోర్టల్ లో జతపరచిన నోటరీ జీపీఏ చెల్లదు. ఎన్నారై పోర్టల్ లో జతపరిచిన జీపీఎ రిజిస్టర్ డాక్యుమెంట్ అయి ఉండాలి. ఈ విషయాన్ని సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలిసికూడా జిల్లా కలెక్టర్ కు తప్పుడు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఇవ్వడంలో జానయ్య తహాశీల్దార్‌ను తప్పుదోవ పట్టించారని సమాచారం. అయితే భూమి కొనుగోలు చేసిన రత్నం నరసింహారెడ్డి తన భార్య పేరు పై మళ్లీ రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తుంది.
కొనుగోలుదారుడు మొత్తం డబ్బులు ఇవ్వకపోవడంతో అధికారులకు ఫిర్యాదు..
భూమి కొనుగోలు చేసిన రత్నం నరసింహారెడ్డి మొత్తం డబ్బులు ఇవ్వకుండా మరొకరికి(తన భార్యకు) రిజిస్ట్రేషన్ చేయడంతో శ్రీధర్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో విచారణ జరిపిన అనంతరం కలెక్టర్ ను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించి, పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని భూములు రిజిస్ట్రేషన్ చేసినట్లుగా భావించి తహాశీల్దార్ గిరిధర్, డిప్యూటీ తహాశీల్దార్ మమత, సీనియర్ అసిస్టెంట్ జానయ్య లను మంగళవారం సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్డీవో స్థాయి అధికారితో విచారణకు కమిటీ ఏర్పాటు..
చౌటుప్పల్ మండల తహాశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి ఆగడాలపై ఆర్డీవో స్థాయి అధికారి చే విచారణ కమిటీ వేసినట్లు సమాచారం. ఈ కమిటీ పూర్తి స్థాయి విచారణ జరిపి ఇచ్చే నివేదికపై ఆధారపడి సదరు రెవెన్యూ అధికారుల పై చర్యలు ఉంటాయని తెలుస్తోంది.