బిపిన్ రావత్ వెల్లింగ్టన్ వెళ్లడానికి కారణం అదేనా..?

by Shamantha N |
Bipin Rawa
X

దిశ, డైనమిక్ బ్యూరో : బిపిన్ రావత్ హెలికాప్టర్ క్రాష్ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో బిపిన్ అసలు వెల్లింగ్టన్ ఎందుకు వెలుతున్నారు అన్న దానిపై నెట్టింట చర్చ జరుగుతోంది. తాను చదువుకున్న కాలేజీ అయిన వెల్లింగ్టన్ మిలిటరీ ట్రైనింగ్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో బిపిన్ ప్రసంగించేందుకు భార్య మధులికతో కలిసి బయలుదేరారు. ఈ క్రమంలో పలువురు ఆర్మీ అధికారులతో కలిసి ఉదయం 9 గంటల సమయంలో ఢిల్లీ నుంచి కే-3602 హెలికాప్టర్‌లో బయలుదేరి.. ఉదయం 11.30 గంటలకు సూలూరు వైమానిక స్థావరానికి చేరుకున్నారు.

అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్​ ఎంఐ-17వీ5 లో వెల్లింగ్టన్​కు వెళ్తుండగా.. మధ్నాహం 12.30 గంటల ప్రాంతంలో కూనూర్​సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో భారీ శబ్ధం రావడంతో స్థానికులు పోలీసులు, ఆర్మీ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. వెంటనే శిథిలాల కింద ఉన్న వారిని వెలికితీసి ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story