- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉగ్రవాదులారా.. కరోనాతో జాగ్రత్త : ఐఎస్
న్యూఢిల్లీ : అత్యంత కిరాతక ఉగ్రవాద సంస్థగా పేరున్న ఐఎస్ఐఎస్‌నూ కరోనావైరస్ కలవరపెడుతున్నది. అందుకే ఉగ్రవాదులారా.. కరోనాతో జాగ్రత్తగా ఉండండని ఆ ఉగ్రసంస్థ సూచనలు చేయకతప్పలేదు. ఐఎస్ సంస్థ దాని న్యూస్‌లెటర్‌లో కొత్తగా ఈ సూచనలను పొందుపరిచింది. తమ సంస్థకు చెందిన జిహాదిస్టులను కరోనావైరస్ ప్రభావిత దేశాలకు ప్రయాణించొద్దని, చేతులు తరుచుగా శుభ్రం చేసుకోవాలని, అర్ధరాత్రి మేల్కొన్నా చేతులు కడుక్కోవాలని కోరింది. అలాగే, జ్వరపీడితులకు దూరంగా ఉండాలని, కరోనాసోకిన వ్యక్తిని సింహంగానే భావించి దూరంగా పరుగు లంకించుకోవాలని సూచించింది. అంతేనా.. తన అనుచురులందరూ దేవుడిపై విశ్వాసం ఉంచాలని, కరోనాకూడా ఆయన ఇచ్ఛ అనుసారమే విస్తరిస్తున్నదని తెలిపింది. బహిరంగంగా తుమ్మడం, దగ్గడంలాంటివి చేయొద్దని, ముఖానికి మాస్క్ ధరించాలని కొన్ని విలువైన సూచనలనూ చేసింది.
Tags: IS, terrrorist group, banned organisation, coronavirus, jihadists, advisories