మహా సముద్రంలో శర్వా, సిద్ధార్థ్

by Jakkula Samataha |
మహా సముద్రంలో శర్వా, సిద్ధార్థ్
X

అజయ్ భూపతి… Rx 100 దర్శకుడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ” “మహాసముద్రం” చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాకు ఇద్దరు హీరోలు అవసరం కాగా… ఇప్పటికే ఒక క్యారెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు శర్వానంద్. ఆయనకు జోడీగా సాయి పల్లవి కూడా ఫైనల్ అయిందట. కానీ అజయ్ బాధ అంతా మరో హీరో గురించే. ఇప్పటికే చాలా మంది హీరోలకు స్టోరీ వినిపించినా సరిగ్గా స్పందించలేదట. దీంతో తన వెతుకులాట ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ ఆ వెతుకులాట హీరో సిద్ధార్థ్ దగ్గర ఆగిపోయిందని సమాచారం.

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, ఓ మై ఫ్రెండ్ లాంటి సినిమాలతో తెలుగులో మంచి హిట్స్ అందుకున్న సిద్ధు… ఆ తర్వాత తమిళ్ లో బిజీ అయిపోయారు. కానీ అక్కడ చేసిన సినిమాలు సిద్ధును అనుకున్న రేంజ్ లో నిలబెట్టలేక పోయాయి. మల్టీ టాలెంటెడ్ అయిన హీరోకు సంతృప్తిని ఇవ్వలేదని తెలుస్తోంది. చాలా కాలంగా టాలీవుడ్ కు దూరంగా కూడా ఉంటున్నాడు. అయితే అజయ్ ఈ సినిమా స్టోరీ చెప్పడంతో చాలా రోజుల తర్వాత సిద్ధు ఓ తెలుగు సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం. పైగా ఇదే మంచి అవకాశంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరై పోవాలని చూస్తున్నాడట.

Tags : Ajay bhupati, Sharwanand, Sai Pallavi, Siddharth, Tollywood

Advertisement

Next Story