- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవసరమా?
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా విప్లవం తర్వాత సొంత జీవితాన్ని సొంతంగా బతకడం కంటే పక్కవాళ్ల జడ్జిమెంట్ ఆధారంగా బ్రతకడం సాధారణంగా మారింది. ఈ క్రమంలోనే లవ్, కన్సర్న్, కేర్ కాస్తా.. లైక్, కామెంట్, షేర్‌లుగా మారిపోయాయి. ఇలాంటి భావనల నుంచే ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ అనే కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. పెళ్లి ఎలా చేసుకున్నా సరే, ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం వినూత్నంగా ఉండాలని కొత్తగా పెళ్లి చేసుకోబోయే జంటలు ప్రయత్నిస్తున్నాయి. అయితే వినూత్నత మాయలో పడి ఈ మధ్య కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ శ్రుతి మించుతున్నాయి. మొన్నటికి మొన్న కేరళలో నగ్నంగా సింగిల్ పీస్ వస్త్రంతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుని ఓ జంట వివాదాల పాలైతే, మరో జంట ఏకంగా ముఖానికి రక్తం పూసుకుని, జాంబీల స్టైల్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. పాపం.. ఓ జంట మాత్రం ప్రీ వెడ్డింగ్ షూట్‌లో భాగంగా నీళ్లలో దిగి ప్రాణాలు కోల్పోయారు. అందుకే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవసరమా? అని ఇంటర్నెట్‌లో ఉన్న సంప్రదాయవాదులు వాదిస్తున్నారు.
కానీ యువత మాత్రం ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవసరమేనని వాదిస్తున్నారు. జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే వేడుక పెళ్లి. అయితే పెళ్లికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఎవరో ఒకరి జోక్యం ఉంటుంది. కానీ ఒక్క ప్రీ వెడ్డింగ్ షూట్‌లో మాత్రమే కాబోయే వధూవరుల నిర్ణయం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇలాంటి జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవడానికి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవసరమని వారు వివరిస్తున్నారు. అయితే వినూత్నత కోసం పాకులాడటం అనేది మాత్రం పూర్తిగా ఇతరుల మెప్పుకొరకు చేసే ప్రయత్నమేనని, అలాంటివి మాత్రం తగ్గించుకోవాలని అంటున్నారు. ప్రమాదాల స్థాయికి ప్రీ వెడ్డింగ్ షూట్ చేరుకోవడం నిజంగా శోచనీయం. అయితే ఉన్నంతలో కొత్తగా, క్రియేటివ్‌గా ఫొటోలు దిగడం కూడా సాధ్యమేనని, ఇలాంటి రిస్క్‌లు అవసరం లేకుండా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటే ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదని సోషల్ మీడియా నిపుణులు చెబుతున్నారు.