ఇండియాలో విస్తరించేందుకు ఐఎస్ ప్రయత్నాలు

by Shamantha N |
Nia
X

న్యూఢిల్లీ: ఇండియాలో విస్తరించాలని ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రయత్నాలు చేస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. ఐఎస్ భావజాలం ద్వారా ప్రేరేపితమై దేశంలో ఉగ్రదాడులకు, కుట్రలకు, నిధుల సమీకరణలకు సంబంధించి 37 కేసుల్లో 167 మందిని అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ వెల్లడించింది. వీటికి సంబంధించి 31కేసుల్లో చార్జ్‌షీట్ ఫైల్ చేసినట్టు పేర్కొంది. వీటిలో విచారణ అనంతరం 27 మంది నిందితులను దోషులుగా తేల్చినట్టు సంస్థ తెలిపింది.

‘భారత్‌లో విస్తరించేందుకు ఐఎస్ ప్రయత్నిస్తున్నట్టు మా దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా ఆన్‌లైన్ ప్రచారం ద్వారా యువతకు దగ్గరయ్యేందుకు ఐఎస్ చూస్తోంది. అమాయకులైన యువతను టార్గెట్ చేసుకుని ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాద్యమాల ద్వారా వారికి దగ్గరయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వీటి పట్ల యువత ఆసక్తి కనబరిచినట్టు అనిపించినా వెంటనే వారితో ఉగ్రసంస్థ ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చర్చలు జరుపుతోంది. అనంతరం వారికి ఐఎస్‌కు సంబంధించిన ఆన్‌లైన్ కంటెంట్ అప్‌లోడ్, ఐఎస్ మెసేజ్‌లను స్థానిక భాషలోకి అనువదించడం, ఉగ్రకుట్రలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సేకరణ, ఐఈడీల తయారీ, ఉగ్రనిధులు, దాడుల వంటి పనులను అప్పగిస్తున్నారు’అని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed