- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది ‘వెలుగు’ ఆఫీస్ కాదు.. రైతుల పాలిట చీకటి ఆఫీస్
దిశ, తుంగతుర్తి: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవడానికి ఐకేపీ కేంద్రానికి తీసుకొస్తే, బిల్లులు కట్ చేసి తక్కువ అమౌంట్ జమ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండంలోని వెలుగు ఆఫీస్‌కు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ… ఐకేపీ సెంటర్లో అమ్మకానికి పోసిన ధాన్యం బిల్లులు తక్కువగా జమ అయ్యాయని రైతులు కలెక్టరేట్‌లో వినతి పత్రం ఇచ్చినా.. ఇంతవరకు మండల అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. ఇది వెలుగు ఆఫీస్ కాదు రైతుల పాలిట చీకటి ఆఫీస్ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు కల్లంలో పోసిన ధాన్యం తడవడంతో తేమ శాతం ఎక్కువ ఉన్నదంటూ క్వింటాకు 7 కిలోల చొప్పున మిల్లు నిర్వాహకులు తరుగు తీస్తున్నారని తెలిపారు. అందుకే రైతుల బిల్లులో అమౌంట్ కట్ చేశామని అధికారులు చెపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
నూతనకల్ మండల వ్యాప్తంగా ఉన్న ఐకేపీ సెంటర్లలో ఇదే తంతు జరుగుతుండగా, మండల కేంద్రంలోని సెంటర్లో మాత్రమే ఎక్కువ ధాన్యాన్ని కట్ చేయడం వెనకాల ఉన్న ఆంతర్యమేంటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్‌లో అక్రమాలకు పాల్పడుతూ అన్నం పెట్టె రైతు చేతులకు సంకెళ్ళను బిగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఏపీఎం కర్ణాకర్‌ను విచారణ కోరగా, ధాన్యం తడిచి తేమ శాతం ఎక్కువగా రావడంతో బియ్యం శాతం తగ్గిందని, అందుకే మిల్లు నిర్వాహకులు ధాన్యాన్ని కట్ చేసుకున్నారని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో కట్ట మల్లారెడ్డి, బండారి లింగారెడ్డి, తీగల మల్లారెడ్డి, దేవిరెడ్డి జనార్ధన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, యాస అనిల్, యాస శ్రీనివాస్ రెడ్డి, బాణాల మల్ల రెడ్డి పాల్గొన్నారు.
18 క్వింటాల ధాన్యం కట్ చేసిండ్రు
నేను 218 క్వింటాల ధాన్యాన్ని(546) స్థానిక నూతనకల్ ఐకేపీ సెంటర్లో అమ్మకానికి పోశాను. నా పంటలోంచి సుమారుగా 18 క్వింటాల ధాన్యాన్ని కట్ చేసి, రూ.36000 వరకు డబ్బులను కట్ చేశారని అన్నారు. నిజంగా మిల్లులలో కట్, ఆ రశీదులను రైతులకు ఇవ్వాలి.
– దేవిరెడ్డి జనార్ధన్ రెడ్డి, రైతు నూతనకల్
బిల్లు రశీదు రైతులకు ఇవ్వాలి
నేను 180 బస్తాలు, అంటే 72 క్వింటాల ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో అమ్మకానికి పోశాను. అందులోంచి తరుగు కింద 5 క్వింటాల ధాన్యం చేశారు. కట్ చేసి నాకు రావాల్సిన డబ్బుల్లోంచి రూ. 9200 తక్కువ చేసి అకౌంటులో జమ చేశారు. మిల్లు నిర్వాహకులు కట్ చేశారని చెపుతున్నారు. నిజంగా మిల్లులలో కట్ అయినట్టే అయితే అట్టి బిల్లు రశీదులు రైతులకు ఇవ్వాలి.