కొవిడ్ పేషెంట్లను ఉచిత భోజనం అందిస్తున్న పఠాన్ బ్రదర్స్

by Shyam |   ( Updated:2021-05-05 11:41:51.0  )
కొవిడ్ పేషెంట్లను ఉచిత భోజనం అందిస్తున్న పఠాన్ బ్రదర్స్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ కొవిడ్ బారిన పడి ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి ఉచితంగా భోజనం అందించనున్నట్లు తెలిపారు. పఠాన్ బ్రదర్స్ ఢిల్లీలో క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్ (క్యాప్)ను నిర్వహిస్తున్నారు. ఈ క్యాప్ ఆధ్వర్యంలో దక్షిణ ఢిల్లీలోని హౌస్ ఐసోలేటెడ్ పేషెంట్లకు ఉచితంగా భోజనం అందిస్తామని ఇర్ఫాన్ పఠాన్ తెలిపారు.

‘దేశం కరోనా సెకెండ్ వేవ్ ప్రభావంతో కష్టాల్లో ఉన్నప్పుడు.. తోటి వారికి సహాయం చేయడం బాధ్యతగా ఫీల్ అవుతున్నాము. అందరం కలసి ఈ గొప్ప సహాయాన్ని అందిద్దాం. చాలా మంది కరోనా రోగుల సేవలో ఉన్నారు. వారి స్పూర్తితో క్యాప్ ఆధ్వర్యంలో ఉచిత భోజనాన్ని అందించాలని అనుకుంటున్నాము’ అని ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు. ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్ ఇటీవల రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొని ఇంటికి వచ్చిన తర్వాత కరోనా బారిన పడి కోలుకున్నారు.

Advertisement

Next Story