శ్రీకాకుళం రోడ్లపై ఇరాక్ అమ్మాయిలు..!

by srinivas |
శ్రీకాకుళం రోడ్లపై ఇరాక్ అమ్మాయిలు..!
X

శ్రీకాకుళం రోడ్లపై ఇరాక్ అమ్మాయిలు కనబడడం స్థానికంగా కలకలం రేపింది. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు ఇరాకీ యువతులు శ్రీకాకుళం పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీపంలో రోడ్లపైకి వచ్చారు. దీంతో వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దగ్గర్లోని కాలేజీలో వారు ఎంఫార్మసీ చదువుతున్నట్టు గుర్తించారు. శ్రీకాకుళంలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. దీంతో వారి ట్రావెల్ రికార్డుపై ఆరాతీస్తున్నారు.

కాగా, ఇరాక్‌లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో కరోనా బారిన 458 మంది పడగా, 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కరోనా భూతంతో 296 మంది పోరాడుతుండగా, 122 మంది కరోనా బారిపడి కోలుకున్నారు. దీంతో వారిపై వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులతో నిఘా ఉంచారు.

Tags: iraq, girls, srikakulam, corona, m.pharm students

Advertisement

Next Story