Bollywood Breaking : ‘వాటే హాటీ’.. బాయ్‌ఫ్రెండ్‌పై అమీర్ కూతురి కామెంట్

by Shyam |   ( Updated:2021-05-24 09:10:28.0  )
Bollywood Breaking : ‘వాటే హాటీ’.. బాయ్‌ఫ్రెండ్‌పై అమీర్ కూతురి కామెంట్
X

దిశ, సినిమా : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్(Aamir Khan)కూతురు తన బాయ్‌ఫ్రెండ్ నుపూర్ శిఖారె(Nupur Shikhare) లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్ అయిన నుపూర్.. తరచూ అందుకు సంబంధించిన పిక్చర్స్‌ను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఐరా(Ira Khan)కు ట్యాగ్ చేస్తుంటాడు. తాజాగా తన మజిల్స్ చూపిస్తున్న ఫొటోను పోస్ట్ చేయగా.. కామెంట్స్ సెక్షన్‌లో ‘వాట్ ఏ హాటీ’ అంటూ రిప్లయ్ ఇచ్చింది ఐరా. కాగా ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి ఇన్‌స్టాలో అఫిషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్‌‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్‌లో నుపూర్ క్లిప్ షేర్ చేసిన ఐరా.. మీ జీవితంలో మీకే సొంతమైన వ్యక్తి ఉండాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. దీనికి స్పందించిన నుపూర్ మరో క్లిప్ షేర్ చేస్తూ.. ‘నా జీవితంలో ఒకరు ఉన్నారు. ఆమె పేరు ఐరా’ అంటూ రెడ్ కలర్ హార్ట్ ఎమెజీ పోస్ట్ చేశాడు.

Advertisement

Next Story