- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన ఐపీఎస్ అధికారి.. కొడుకు పెళ్లిలో…
దిశ, చార్మినార్ : ప్రముఖ వ్యాపారవేత్త దుబ్బె పెర్ఫ్యూమ్ కుమార్తె వివాహం ఐపీఎస్ అధికారి కుమారుడితో సోమవారం అర్థరాత్రి వరకు పాతబస్తీలో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకలు లాక్‌డౌన్ రూల్స్ ని బ్రేక్ చేశాయి. వివాహ వేడుకల సందర్భంగా లాక్‌డౌన్ టైంలో దుబ్బె కుటుంబం పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ హడలెత్తించింది. సోమవారం రాత్రి పాతబస్తీ సవేరా ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ జైళ్ల శాఖ ఆదనవు డైరెక్టర్ జనరల్ రాజీవ్ త్రివేది కుమారుడి వివాహం ప్రముఖ వ్యాపారవేత్త దుబ్బె పెర్ఫ్యూమ్ శ్రీనివాస్ కుమార్తెతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భారీగా టపాసులు పేల్చారు. ఈ వివాహానికి స్వయంగా సౌత్ జోన్ పోలీసులే భారీ బందోబస్తును నిర్వహించారు.
ఈ పెళ్లికి హోమ్ మంత్రి మహమూద్ అలీతో పాటు వివిఐపిలు హాజరయ్యారు. కేవలం వివాహానికి 40 మంది మాత్రమే హాజరు కావాలని నియమనిబంధనలు ఉన్నప్పటికీ 100 మంది కి పైగా హాజరు కావడం… ఒక ఐపీఎస్ అధికారి కుమారుడి పెళ్లికి ప్రత్యేక అనుమతులు ఎలా వస్తాయి అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్‌డౌన్ నిబంధనలు తుంగలోతొక్కి అర్థరాత్రి వరకు పాతబస్తీలో పెళ్లి వేడుకలు నిర్వహిస్తున్నారని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి లకు ఫిర్యాదు చేశారు. సామాన్యుడికి ఒక రూల్ ఐపీఎస్ అధికారికి మరొక రూలా అంటూ విమర్శలు చేశారు.