ఎల్ఐసీలో రూ. 75 లక్షల ఉద్యోగం.. వెంటనే అప్లై చేసుకోండి

by Harish |   ( Updated:2021-09-30 07:05:13.0  )
ఎల్ఐసీలో రూ. 75 లక్షల ఉద్యోగం.. వెంటనే అప్లై చేసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ బీమా సంస్థ ఎల్ఐసీ సంస్థకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) నియామకానికి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపింది. మూడేళ్ల కాలానికి లేదంటే అభ్యర్థికి 63 ఏళ్ల వరకు ఏది ముందైతే అందుకు తగినట్టు నియమించనున్నట్టు ఎల్ఐసీ వెల్లడించింది. సంబంధిత అభ్యర్థికి సంబంధించి 6 నెలల ప్రాతిపదికన సమీక్ష ఉంటుంది. సీఎఫ్ఓ పదవికి ఎంపికైన వారికి రూ. 75 లక్షల వార్షిక వేతనం ఉండనుంది. దరఖాస్తు చేసేందుకు ఆఖరి తేదీ ఈ ఏడాది అక్టోబర్ 12గా నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభంలో సంస్థలోని అత్యున్నత పదవి విషయంలో కీలక మార్పులు చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎల్‌ఐసీ చట్టం 1956లోని కొన్ని సవరణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఐపీఓకు ముందే సీఎఫ్ఓను నియమించనున్నారు. జులై నాటి నోటిఫికేషన్ ప్రకారం.. ఎల్‌ఐసీ చైర్మన్‌ పదవిని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మార్చారు. ఎల్‌ఐసీ చైర్మన్‌ను సీఈవో అని వ్యవహరించనున్నారు. ఎల్ఐసీ ఐపీఓలో భాగంగా ప్రభుత్వం గతవారం లీగల్ అడ్వైజర్‌ను నియమించింది. 2022, జనవరి-మార్చి నాటికి ఐపీఓకు రావాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉంది.

Advertisement

Next Story