విరాట్ కోహ్లీ ఎమోషనల్ నోట్.. మీరు మా గుండెల్లో ఉన్నారంటున్న ఫ్యాన్స్

by Mahesh |   ( Updated:2023-05-23 07:04:32.0  )
విరాట్ కోహ్లీ ఎమోషనల్ నోట్.. మీరు మా గుండెల్లో ఉన్నారంటున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్ రేసు నుంచి బెంగళూరు జట్టు తప్పుకుంది. 16 సీజన్ లో వీరోచితంగా పోరాడిన RCB ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. చివరి మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత RCB మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి సారి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ రాసిన కోహ్లీ కొన్ని ఫోటోలను కూడా పంచుకున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో

ఇలా రాశాడు.. "ఈ సీజన్‌లో కొన్ని క్షణాలు ఉన్నాయి కానీ దురదృష్టవశాత్తూ మేము లక్ష్యాన్ని సాధించలేకపోయాము. నిరాశ చెందాము, కానీ మేము తలలు పట్టుకోవాలి ," అని అతను రాశాడు. "మా నమ్మకమైన మద్దతుదారులకు... అడుగడుగునా మాకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు" అని ఆయన అన్నారు. దీనికి కోహ్లీ ఫ్యాన్స్ స్పందిస్తూ.. మీరు గెలిచినా ఓడినా మీరు ఎప్పుడు మా గుండెల్లోనే ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story