- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌లో నేడు డబుల్ ధమాకా.. పంజాబ్ vs కోల్‌కతా, లక్నో vs ఢిల్లీ
లక్నో: ఐపీఎల్-16లో నేడు తొలి డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొహాలి వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. లక్నో వేదికగా జరిగే రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభకానుంది. లీగ్‌లో తొలి మ్యాచ్‌తోనే శుభారంభం చేయాలని నాలుగు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
కొత్త కెప్టెన్ల సారథ్యంలో పంజాబ్, కోల్‌కతా
పంజాబ్, కోల్‌కతా రెండు జట్లు ఈ సీజన్‌లో కొత్త కెప్టెన్ నాయకత్వంలోనే ఆడబోతున్నాయి. పంజాబ్ కింగ్స్‌కు శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తుండగా.. శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో కేకేఆర్‌ను నితీశ్ రాణా నడిపించనున్నాడు. కోల్‌కతా ఆల్‌రౌండర్లతో నిండి ఉన్నది. ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, శార్దూల్ ఠాకూర్, వెంకటేశ్ అయ్యర్, డేవిడ్ వైస్ బంతితోపాటు బ్యాటుతోనూ మెరుపించే వారు ఉండటం కేకేఆర్‌కు బలం కానుంది. నితీశ్ రాణాకు తోడు ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న లిటాన్ దాస్ ఓపెనింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.కోల్‌కతాతో పోలిస్తే పంజాబ్ పేపర్‌పై బలంగా కనిపిస్తుంది. అయితే, తొలి మ్యాచ్‌కు లివింగ్‌స్టోన్‌తోపాటు కగిసో రబాడా దూరం కావడం ఎదురుదెబ్బే. అయినప్పటికీ శిఖర్ ధావన్, మ్యాట్ షార్ట్, సామ్ కర్రన్, సికిందర్ రాజా, భానుక రాజపక్స, జితేశ్ శర్మ వంటి వారు ఉండటం జట్టుకు బలాన్నిచేదే. అయితే, మిడిలార్డర్ అనుభవజ్ఞులు లేకపోవడం లోటనే చెప్పొచ్చు. సామ్ కర్రన్, అర్ష్‌దీప్ సింగ్‌లపైనే బౌలింగ్ ఆధారపడి ఉన్నది.
శుభారంభంపై లక్నో, ఢిల్లీ ఫోకస్
గత సీజన్‌లో అరంగేట్రంలోనే మంచి ప్రదర్శన చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఈ సారి కూడా సత్తాచాటాలనుకుంటున్నది. లక్నోకు కెప్టెన్ కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, రొమారియా షెపర్డ్ వంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అలాగే, కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, మార్కస్ స్టొయినిస్ వంటి బంతితోపాటు బ్యాటుతోనూ సత్తాచాటే ఆల్‌రౌండర్లు ఉండటం ఆ జట్టుకు అదనపు బలం కానుంది. బౌలింగ్‌లో అవేశ్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, డేనియల్ సామ్స్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, కరణ్ శర్మ వంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. ఇంగ్లాండ్ పేసర్ మార్క్‌వుడ్ గాయం కారణంగా జట్టుకు దూరమవడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ సైతం గట్టి పోటీనిచ్చేలానే ఉంది. కెప్టెన్ పంత్ సీజన్ మొత్తానికి దూరమవడం ఆ జట్టుకు ఎవరు పూడ్చలేని లోటు. అయితే, డేవిడ్ వార్నర్, పృథ్వీషా, మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్, పొవెల్ వంటి క్రికెటర్లతో ఢిల్లీ బ్యాటింగ్ దళం పవర్‌ఫుల్‌గా ఉంది. ఐపీఎల్‌లో వార్నర్ సుదీర్ఘ కెప్టెన్సీ అనుభవం కూడా జట్టుకు కలిసొచ్చే అవకాశం ఉన్నది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లతో స్పిన్ బౌలింగ్ కూడా బలంగా ఉండగా.. లుంగి ఎంగిడి, ఎన్రిచ్ నోర్జే, ముఖేశ్ కుమార్, చేతన్ సకారియాలతో పేస్ దళం పటిష్టంగా ఉన్నది. అలాగే, యువ క్రికెటర్లతో బెంచ్ కూడా బలంగా ఉండటంతో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఢిల్లీ జట్టు చక్కగా వినియోగించుకునే అవకాశం ఉన్నది. అయితే, పంత్ దూరం కావడంతో జట్టు మిడిలార్డర్‌లో టీమ్ కాంబినేషన్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉన్నది.