- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇవాల్టి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తప్పక గెలవాల్సిందే.. ఎందుకంటే??
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో ఇప్పటి వరకు దాదాపు అన్ని జట్లు 10 మ్యాచులో పూర్తి చేసుకున్నాయి. కాగా ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో దాదాపు ముంబై, ఆర్సీబీ మినహా.. మిగిలిన అన్ని జట్టు ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. 9 మ్యాచుల్లో 8 విజయాలతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచి దాదాపు ప్లే ఆఫ్ బెర్త్ ను కన్ఫామ్ చేసుకుంది. మిగిలి మూడు స్థానాల కోసం మొత్తం 8 జట్లు పోటీ పడుతున్నాయి. కాగా ఈ సీజన్ లో సంచలనంగా మారిన సన్ రైజర్స్ జట్టు ప్లే ఆఫ్ చేరుకోవాలంటే మిగిలిన ఐదు మ్యాచుల్లో 4 విషయాలు అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రోజు రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచులో హైదరాబాద్ గెలిస్తేనే ఈ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ ఈ రోజు గెలిస్తే మూడో స్థానం చేరుకుంటుంది. ఈ క్రమంలోనే నేటి మ్యాచులో సన్ రైజర్స్ జట్టు తప్పక గెలవాల్సి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్లే ఆఫ్ రేసులో ఉన్న మిగిలిన జట్లకు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక నుంచి ఒక్క మ్యాచులో ఓడిపోయిన వారి ప్లే ఆఫ్స్ ఆశాలు క్లిష్టతరంగా మారుతాయి. అందుకు వరుస విజయాలతో ఉన్న రాజస్థాన్ కు ఓడిపోయిన పెద్దగా ఇబ్బంది. ఉండదు దీంతో ఆ జట్టుపై గెలవడం సన్ రైజర్స్ కు చాలా అవసరం ఈ రోజు జరిగే మ్యాచులో ఆరెంజ్ ఆర్మీ గెలిచి హాట్రిక్ ఓటమిని తప్పించుకుంటుందా లేదా.. అనేది తెలియాలంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే.