SRH VS RCB: బెంగళూరులో ఎస్ఆర్‌హెచ్ విధ్వంసం.. ఓపెనర్ ట్రావిస్ హెడ్ మెరుపు సెంచరీ

by Shiva |   ( Updated:2024-04-15 19:30:27.0  )
SRH VS RCB: బెంగళూరులో ఎస్ఆర్‌హెచ్ విధ్వంసం.. ఓపెనర్ ట్రావిస్ హెడ్ మెరుపు సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ కరెక్ట్‌గా ఊహించినట్లుగానే జరిగింది. సోషల్ మీడియాలో క్రీడాభిమానులు ఆర్సీబీ జట్టును మీమ్స్‌‌తో ఎలాగైతే ట్రోల్స్ చేశారో అచ్చం అలాగే.. ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్లు బెంగళూరులోకి చిన్నస్వామి స్టేడియంలో రెచ్చిపోయారు. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వేగంగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ఓ వైపు ఓపెనర్ ట్రావిస్ హెడ్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 41 బంతుల్లో 102 (8 సిక్స్‌లు, 9 ఫోర్లు) పరుగులు చేసి ఐపీఎల్‌లో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.

ప్రత్యర్థి జట్టులో బౌలర్ ఎవరనేది చూడకుండా.. బాల్ స్డేడియం స్టాండ్స్‌లో పడిందా లేదా అన్న తీరున హెడ్ బ్యాటింగ్ కొనసాగింది. మరో ఎండ్‌లో చక్కని ఫాంలో ఉన్న అభిషేక్ శర్మ తనదైన స్టైల్‌లో చూడ చక్కని షాట్లతో అందరిని అలరించాడు. ఏ మాత్రం టెంపో మిస్ అవ్వకుండా వరుసగా ఫోర్లు, సిక్సర్లు కొడుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే ఓపెనర్ అభిషేక్ శర్మ పేసర్ తోప్లే బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ధాటిగా ఆడుతున్న ట్రావీస్ హెడ్‌ 102 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్ఎచ్ 13 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లను కోల్పోయి 171 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 12 బంతుల్లో 25 పరుగులు, మార్క్‌రామ్ 1 పరుగు చేసి క్రీజ్‌లో ఉన్నారు.

Advertisement

Next Story