IPL 2023: రాజస్థాన్‌పై గుజరాత్‌ ఘన విజయం

by Vinod kumar |   ( Updated:2023-05-05 17:05:11.0  )
IPL 2023: రాజస్థాన్‌పై గుజరాత్‌ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. 13.5 ఓవర్లలో గిల్‌ వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి. గుజరాత్‌ ఓపెనర్లు వృద్దిమాన్‌ సాహా (41 నాటౌట్‌), శుభ్‌మన్‌ గిల్‌ (36) రాణించగా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్ధిక్‌ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్తాన్ బౌలర్‌లో చహల్‌ 1 వికెట్ తీశాడు.

అంతకు ముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌.. గుజరాత్‌ బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. సంజూ శాంసన్ (30; 20 బంతుల్లో 3x4, 1x6) టాప్‌ స్కోరర్‌. ట్రెంట్‌ బౌల్ట్‌ (15; 11 బంతుల్లో 1x4, 1x6) కాసేపు పోరాడాడు. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 3, నూర్‌ అహ్మద్‌ 2, షమీ, హార్ధిక్‌, జాషువ లిటిల్‌ తలో వికెట్‌ తీశారు.

Advertisement

Next Story