ఆర్సీబీ vs చెన్నై మ్యాచ్.. ట్రెండింగ్‌లో వర్షం

by Mahesh |   ( Updated:2024-05-20 10:52:16.0  )
ఆర్సీబీ vs చెన్నై మ్యాచ్.. ట్రెండింగ్‌లో వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో సీజన్ కు సంబంధించి ఇప్పటి కలకత్తా, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్ చేరుకోగా మిగిలి నాలుగో స్థానం కోసం చెన్నై, ఆర్సీబీ జట్లు పోటీ పడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్ ఫలితంపై ప్లే ఆఫ్ రేసులో ఎవరు కొనసాగుతారనేది ఆధారపడి ఉంది. అయితే ఈ మ్యాచ్ నిర్వాహణకు వరుణ గండం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం.. ఈ రోజు బెంగళూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో గత రెండు రోజులుగా వర్షం కురవద్దని ఆర్సీబీ అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తుండగా.. చెన్నై అభిమానులు మాత్రం వర్షం కురిసి మ్యాచ్ రద్దవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ సీజన్ లో ప్రస్తుతం చెన్నై 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. దీంతో మ్యాచ్ రద్దైతే చెన్నై కు 1 పాయింట్ వస్తుంది. దీంతో 15 పాయింట్లతో సీఎస్కే జట్టు ప్లే ఆఫ్ చేరుకుంటుంది. ఈ క్రమంలో ఇరు జట్లు ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా వర్షాన్ని ట్రెండింగ్ చేస్తున్నారు. బెంగళూరులో ఉన్న ప్రజలైతే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి వాతావరణానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి ఆర్సీబీ vs చెన్నై, వర్షం vs ఫ్యాన్స్ అన్నట్లుగా సోషల్ మీడియాలో ట్రెండ్ కొనసాగుతుంది. మరీ ఇవాల్టి మ్యాచ్ కు వరుణుడు కరుణిస్తాడా లేదా తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే మరి.

Click Here For Twitter Post..

Advertisement

Next Story