- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘RCB కప్ కొట్టకపోవడానికి ఆ పాపాలే కారణం’.. సోషల్ మీడియాలో కొత్త ప్రచారం..!
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 2024 ఆసక్తికరంగా సాగుతోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమ్స్ చతికిలపడుతుండగా.. ఎక్కువగా హైప్ లేని జట్లు సునాయసంగా విజయాలు సాధిస్తున్నాయి. ఇక, ప్రతి సీజన్‌లో ఈ సాలా కప్ నమ్దే అంటూ బరిలోకి దిగడం.. చివరికి చేతులేత్తేయడం అలవాటుగా మార్చుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సారి కూడా తమ వైఫల్యాల పంథాను కొనసాగిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచులు ఆడిన ఆర్సీబీ.. కేవలం ఒక్క మ్యాచులోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీ పడుతోంది. కోహ్లీ, మాక్స్‌వెల్, గ్రీన్, డుప్లెసిస్ వంటి భయంకర ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఆర్సీబీ విఫలమవుతుండటంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్క విరాట్ కోహ్లీ తప్ప మిగతా ప్లేయర్స్ రాణించకపోవంతో ఆర్సీబీ ఈ సీజన్‌లో అప్పుడే హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసింది. ఇదిలా ఉంటే, ఆర్సీబీ వరుస ఓటములపై సోషల్ మీడియాలో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
మొత్తం ఐపీఎల్ 17 సీజన్లలో ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్పు కొట్టకపోవడానికి ఆ ఫ్రాంచైజ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యానే కారణం అంటూ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. కింగ్ ఫిషర్ మాజీ అధినేత మాల్యా భారత్‌లోని వివిధ బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో తండ్రి చేసిన పాపాలు పిల్లలకు తగిలినట్లే.. ఫ్రాంచైజ్ మాజీ ఓనర్ మాల్యా చేసిన పాపాలు ఆర్సీబీ జట్టుకు తగులుతున్నాయని.. అందుకే రాయల్ ఛాలెంజర్స్ ఒక్క టైటిల్ కూడా కొట్టలేదని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్ వెల్, గేల్ వంటి స్టార్ ప్లేయర్స్ జట్టులో ఉన్నప్పటికీ ఆర్సీబీ కప్ కొట్టకపోవడానికి కారణం ఇదేనని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే, ఈ కామెంట్లపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అవును నిజమే అంటుండగా.. బ్యాటింగ్ బలంగా ఉన్న బౌలింగ్ ఎటాక్ వీక్‌గా ఉండటంతోనే ఆర్సీబీ టైటిల్ గెలకలేకపోతుందని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆర్సీబీ మాత్రం ఈ సీజన్‌లో కూడా చతికిలపడుతుండటంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు.