- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా కొడుకును ట్రోల్ చేశారు..చూడలేక ఆ పని చేశాం.. యశ్ దయాల్ తండ్రి భావోద్వేగం
దిశ, స్పోర్ట్స్ : యశ్ దయాల్.. ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్‌పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. చెన్నయ్‌తో కీలక పోరులో అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడుతున్నారు. అయితే, గతేడాది ఇదే యశ్ దయాల్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. గత సీజన్‌లో గుజరాత్‌కు అతను ఆడగా.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఐదు సిక్స్‌లు ఇచ్చాడు. అప్పుడు రింకు సింగ్ హీరోగా మారగా.. యశ్ దయాల్‌ను మాత్రం దారుణంగా ట్రోల్ చేశారు. ఇదే విషయాన్ని యశ్ దయాల్ తండ్రి తాజాగా గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.
జాతీయ మీడియాతో చంద్రపాల్ మాట్లాడుతూ.. తన కొడుకును దారుణంగా ట్రోల్ చేశారని, అది చూడలేక తమ కుటుంబం సోషల్ మీడియాకు దూరంగా ఉందని చెప్పాడు. ‘ఒక వాట్సాప్ గ్రూపులో నాకు తెలిసిన ఓ వ్యక్తి ఓ మీమ్ షేర్ చేశాడు. యశ్ దయాల్ ఇచ్చిన ఐదు సిక్స్‌లను ప్రస్తావిస్తూ ‘ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కథ మొదలవక ముందే ముగిసింది’ అని రాసుకొచ్చారు. అలాంటివి వస్తూనే ఉన్నాయి. దీంతో మేము అన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకున్నాం. యశ్ దయాల్‌ను ఆర్‌సీబీ రూ. 5 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ‘బెంగళూరు డబ్బులను డ్రైనేజీలో పడేసింది’ అని ఎవరో చెప్పడం నాకు గుర్తుంది.’ అని భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సీజన్‌లో యశ్ దయాల్ ప్రదర్శనపై చంద్రపాల్ సంతోషం వ్యక్తం చేశాడు.
కాగా, చెన్నయ్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో యశ్ దయాల్ 2 వికెట్లతో సత్తాచాటాడు. చెన్నయ్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు కావాల్సి ఉండగా.. అద్భుతంగా బౌలింగ్ చేసిన యశ్ దయాల్ 7 పరుగులే మాత్రమే ఇవ్వడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో యశ్ దయాల్ సంచలన ప్రదర్శన చేశాడు. 13 మ్యాచ్‌ల్లో 8.94 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు బెంగళూరు తరపున అతనే టాపర్ వికెట్ టేకర్.