కోహ్లీ, గంభీర్‌లకు షాకిచ్చిన ఐపీఎల్

by Mahesh |   ( Updated:2023-05-02 03:23:01.0  )
కోహ్లీ, గంభీర్‌లకు షాకిచ్చిన ఐపీఎల్
X

దిశ, వెబ్‌డెస్క్: సోమవారం లక్నో, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్‌ చివర్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లక్నో కోచ్ గంభీర్, బెంగళూరు కెప్టెన్ కోహ్లీ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం నెలకొంది. గత మ్యాచ్‌లో లక్నోతో ఓడిపోయిన సందర్భంగా గంభీర్ చేసిన సైగలకు ప్రతీకారంగా కోహ్లీ నిన్నటి మ్యాచ్‌లో రివేంజ్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించిన తర్వాత కోహ్లీ గంభీర్ మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఈ ఇస్యూని రీఫరీ సీరియస్‌గా తీసుకున్నారు.

దీంతో.. కోహ్లీ, గంబీర్ ల మ్యాచ్ ఫీజ్‌లో 100 శాతం కోత విధించారు. అలాగే గోడవకు కారణం అయిన నవీన్ ఉల్ హక్‌కు మ్యాచ్ ఫీజులో 50శాతం కొతవిదిస్తున్నట్లు రిఫరీ ప్రకటించారు. ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఐపీఎల్ ప్రకటించింది. అలాగే వీరిద్దరి మధ్య తరుచు గొడవ జరుగుతుండటంతో త్వరలో కోహ్లీ, గంభీర్‌లతో రిఫరీ స్వయంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story