మరి కాసేపట్లో ఉప్పల్‌లో IPL మ్యాచ్.. ఒక్కసారిగా మారిన వాతావరణం

by Satheesh |   ( Updated:2023-04-24 13:03:41.0  )
మరి కాసేపట్లో ఉప్పల్‌లో  IPL మ్యాచ్.. ఒక్కసారిగా మారిన వాతావరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండటంతో ప్లేయర్స్, ఫ్యాన్స్ అంతా ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. దీంతో ఉప్పల్‌లో ఐపీఎల్ సందడి నెలకొంది. ఈ సమయంలో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుండి వేడిగా ఉన్న వాతావరణం మ్యాచ్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు మేఘావృతమైంది.

స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక, ఈ సీజన్‌లో చెరో ఆరు మ్యాచులు ఆడిన హైదరాబాద్, ఢిల్లీ పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆరు మ్యాచులు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 2 గెలిచి 4 ఓడగా.. ఢిల్లీ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి, 5 మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

Advertisement

Next Story