- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పండి.. కోట్లిస్తాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీల భారీ కుట్ర!
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ఇప్పుడు ప్రపంచంలోనే ఖరీదైన క్రికెట్ లీగ్. భారత్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో బీసీసీఐ కోట్లు ఆర్జిస్తుండటంతో అందరి కన్ను ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్‌పై పడింది. ఇప్పటికే ఐపీఎల్‌కు చెందిన కొన్ని ఫ్రాంచైజీలు విదేశీ లీగ్‌ల్లోనూ భాగమయ్యాయి. సౌతాఫ్రికా వేదికగా ఈ ఏడాదే ప్రారంభమైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో 6 జట్లకు 6 జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీ లీగ్సే కొనుగోలు చేశాయి. యూఏఈ లీగ్స్, కరేబియన్ లీగ్స్‌లోనూ భాగమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆయా లీగ్‌ల్లోని తమ జట్ల తరఫున ఆడేందుకు అంతర్జాతీయ ఆటగాళ్ల కోసం గాలం వేస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి, ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌ల్లో ఉన్న తమ జట్ల తరఫున ఆడేలా ఆరుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్లతోనూ ఫ్రాంఛైజీలు చర్చించినట్లు తెలుస్తోంది. ఏడాది పాటు ఆయా ఆటగాళ్లతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుని, అందుకు గాను దాదాపు రూ.50 కోట్ల వరకూ చెల్లించేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నట్లు బిజినెస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఏడాదికి రూ.50 కోట్ల కాంట్రాక్ట్ అంటే చాలా మంది ఆటగాళ్లు తమ దేశ కాంట్రాక్టులను వదులుకొని ఫ్రాంచైజీ లీగ్స్ ఆడనున్నారు. ఇప్పటికే వెస్టిండీస్ ఆటగాళ్లు తమ జాతీయ జట్టుకు ఆడటం కంటే ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు గనుక రూ.50 కోట్ల ఆఫర్ ఇస్తే.. ఇతర దేశాల ఆటగాళ్లు కూడా ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకు క్యూ కడుతారని, అవసరమైతే తమ దేశం తరఫున రిటైర్మెంట్ ప్రకటించి వస్తారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఫుట్ బాల్ లీగ్‌లో ఏడాదంతా ఫ్రాంచైజీలను అట్టి పెట్టుకునే ఆటగాళ్లు ఉన్నారు. అదే మాదిరి ఐపీఎల్ ఫ్రాంచైజీలు పూర్తి స్థాయి ఆటగాళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.