IPL 203: టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్..

by Vinod kumar |   ( Updated:2023-05-14 02:16:39.0  )
IPL 203: టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 203లో భాగంగా జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తమ జట్టులో ఒక కీలకమైన మార్పు చేసినట్లు సంజూ తెలిపాడు. ఈ ఐపీఎల్‌లో అంతగా ఆకట్టుకోని జేసన్ హోల్డర్ స్థానంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాను ఆడిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సీజన్‌లో నేడు రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్ టైటాన్స్‌ జట్లు రెండో సారి తలపడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో చివరి ఓవర్ 12 పరుగులు చేయలేక ఓటమిపాలైన గుజరాత్.. మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. 8 మ్యాచ్‌ల్లో 6 గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న గుజరాత్.. మరో మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలనుకుంటోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైంది.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

వృద్ధిమాన్ సాహా(w), హార్దిక్ పాండ్యా(c), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (w/c), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

Advertisement

Next Story