IPL 2023: యశస్వి జైస్వాల్ విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ

by Vinod kumar |   ( Updated:2023-05-14 02:14:01.0  )
IPL 2023: యశస్వి జైస్వాల్ విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా కోల్‌కతాలో జరుగుతున్న మ్యాచ్‌లో యువ సంచలనం యశస్వి జైస్వాల్​వీర విహారం చేశాడు. రాజస్థాన్​ యంగ్​ ప్లేయర్​ యశస్వి ఇండియన్ ప్రీమియర్​లీగ్ చరిత్రలోనే అత్యంత వేగంగా అర్ధ సెంచరీ బాది.. సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకుని రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ రికార్డును అధిగమించాడు.

13 బంతుల్లోనే జైస్వాల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్న జైశ్వాల్‌ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.. అయితే ఓవరాల్‌గా టి20ల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు యువరాజ్‌ సింగ్‌ పేరిట ఉంది. 12 బంతుల్లోనే యువరాజ్‌ ఈ ఫీట్‌ సాధించగా.. ఇప్పుడు యువరాజ్ తర్వాత జైస్వాల్ రెండో స్థానంలో నిలిచాడు. 2007 టి20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ పై యువీ 12 బాల్స్‌లోనే ఫిఫ్టీ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో యువరాజ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదిన రికార్డు కూడా ఉంది.

Advertisement

Next Story

Most Viewed