- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IPL 2023: ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవని జట్లు ఇవే.. ఈ సరైన టైటిల్ గెలుస్తాయా..?
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 ఆరంభమై 16 సీజన్స్ కావొస్తున్న కనీసం ఒక సారైన టైటిల్ గెలవని జట్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు మొత్తం 15 ఎడిషన్లు జరిగాయి. ఇందులో కేవలం ఆరు జట్లు మాత్రమే టైటిళ్లను సాధించాయి. అయితే ఇప్పటి వరకు ఒకసారైన ఐపీఎల్ టైటిల్ గెలవని జట్లేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ ఒక్కసారి కూడా గెలవని జట్లు మూడు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఎలెవన్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు.. ఫైనల్ వరకు వచ్చినప్పటికీ టైటిల్ ను మాత్రం గెలవలేకపోయాయి. ఈ మూడు జట్లు మాత్రం ఇప్పటివరకు జరిగిన 14 సీజన్లలో ఆడాయి. కానీ ఒక్కసారి కూడా ట్రోఫీని దక్కించుకోలేకపోయాయి.
ఈ జాబితాలో ఆర్సీబీ జట్టు గురించి చెప్పుకోవాలి. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న ఆర్సీబీ జట్టు ఒకసారి కూడా టైటిల్‌ను గెలివలేకపోయింది. ఫైనల్ వరకు వచ్చినప్పటికీ టైటిల్‌ను మాత్రం గెలవలేకపోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్‌కు వెళ్లింది. 2009లో డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత 2011లో చెన్నై చేతిలో 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక 2016లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆర్సీబీ మట్టి కరిపించింది. దీంతో ఆ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవలేకపోయింది.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు 2014లో ఫైనల్‌కు చేరింది. కోల్ కతా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ పంజాబ్ జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా 2020లో ఫైనల్ వరకు వచ్చినా.. ఓటమిపాలైంది. ఢిల్లీపై.. ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ ఆరంభం నాటి నుంచి ఈ మూడు జట్లు ప్రతి సీజన్‌లో ఆడుతున్నప్పటికీ అంతిమ విజయాన్ని మాత్రం అందుకోవడం లేదు. ఈ 2023 సీజన్‌లోనైనా ఈ మూడు జట్లలోంచి ఏదైనా ఒక టీం విజయాన్ని అందుకుంటుందా లేదా అనేది వేచిచూడాలి.
అత్యధిక టైటిళ్లు సాధించిన రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉంది. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్‌లలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై 5 సార్లు టైటిల్ లిఫ్ట్ చేసింది. తర్వాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. 2010,2011,2018,2021 సీజన్‌లలో సీఎస్‌కే జట్టు నాలుగు సార్లు ట్రోఫీని ముద్దాడింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ 2012, 2014లో, రాజస్థాన్ రాయల్స్ 2008లో, డెక్కన్ ఛార్జర్స్ 2009లో, సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో టైటిల్ గెలుచుకున్నాయి.