- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: ఆ రెండు జట్లకు విలన్‌గా మారనున్న సన్‌రైజర్స్..!
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ఈ రెండు జట్లకు సన్‌రైజర్స్ విలన్‌గా మారే అవకాశాలు లేకపోలేదు. సన్‌రైజర్స్ తన తదుపరి మ్యాచ్‌లల్లో రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్‌లను ఢీకొట్టబోతోంది. ఈ రెండింట్లో గెలిచినా సన్‌రైజర్స్‌కు ఒరిగేదేమీ ఉండదు. 12 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో చేరుతాయి. దీంతో ప్లేఆఫ్స్‌కు వెళ్లలేదు. ఈ రెండింట్లో గెలవడం అంటే ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌ను ఓడించడం వల్ల ఆ రెండు జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలను మాత్రం దారుణంగా దెబ్బకొట్టగలుగుతుంది. సన్‌రైజర్స్ జట్టు.. ముంబై, బెంగళూరులకు ఆపద్బాంధవుడిలా కనిపిస్తోంది. ఓడిపోయి తమ ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టకూడదనే ఆ రెండు జట్ల అభిమానులు కోరుకుంటోన్నారనడంలో సందేహాలు అక్కర్లేదు.
ఈ నెల 21వ తేదీన చివరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్టామి స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఈ చివరి లీగ్ షెడ్యూల్ అయింది. ప్లేఆఫ్స్ చేరాలంటే రాయల్ ఛాలెంజర్స్‌కు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు వాంఖెడే స్టేడియంలో మరో మ్యాచ్ జరుగనుంది. ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.
ఇది- ముంబై ఇండియన్స్‌కు లైఫ్ అండ్ డెత్ గేమ్. ప్లేఆఫ్స్‌లో నిలవాలంటే సన్‌రైజర్స్‌ను ఓడించాల్సి ఉంటుంది.. అది కూడా భారీ తేడాతో. ఈ మ్యాచ్‌లో గెలిచినా ప్లేఆఫ్స్ చేరుతుందనే గ్యారంటీ ఏ మాత్రం లేదు. ముంబైకి బదులుగా ఆర్సీబీ ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా తన తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోనే ఢీ కొట్టనుంది. ప్లేఆఫ్ రేసులో ఆర్సీబీ ముందడుగు వేయాలంటే ఈ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిందే. సన్‌రైజర్స్ చేతిలో ఓడితే మాత్రం సంక్లిష్టమౌతాయి. 21న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే చివరి లీగ్‌లో గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంది.
Also Read..
10 రోజులుగా నా తండ్రి ICUలో ఉన్నాడు.. అతని కోసమే నేను ఆ గేమ్ ఆడుతున్నాను: Mohsin Khan