IPL 2023: టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్..

by Vinod kumar |   ( Updated:2023-05-14 12:37:19.0  )
IPL 2023: టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్-16లో ఆడిన 9 మ్యాచ్ లలో మూడు మాత్రమే గెలిచిన సన్ రైజర్స్ నిన్నటివరకూ 9వ స్థానంలో ఉండేది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీని ఓడించడంతో ఆ జట్టు 8 పాయింట్లతో 9వ స్థానానికి ఎగబాకింది. సన్ రైజర్స్ ఆడే ఆరు మ్యాచ్ లలో గెలిచినా ప్లేఆఫ్స్ కు చేరడం కష్టమే అయినా కాస్త పరువు నిలుపుకునే విధంగా అయినా చేసుకుంటే చాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. బ్యాటింగ్ వైఫల్యాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో అయినా పుంజుకుంటుందో లేదో చూడాలి.

సన్ రైజర్స్ హైదరాబాద్:

అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్ , మార్కో జాన్సెన్, వివ్రంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి. నటరాజన్

రాజస్తాన్ రాయల్స్:

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, జో రూట్, సంజూ శాంసన్ (కెప్టెన్), షిమ్రన్ హిట్‌మెయర్, ధ్రువ్ జురెల్, మురుగన్ అశ్విన్, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ , కుల్దీప్ యాదవ్, సందీప్ శర్మ

Advertisement

Next Story