IPL 2023 Qualifier 2: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్‌..

by Vinod kumar |   ( Updated:2023-05-27 11:17:09.0  )
IPL 2023 Qualifier 2: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా క్వాలిఫియర్‌-2 పోరులో అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టు ఇంటి బాట పట్టనుంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన ముంబై 81 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఇదే జోరును క్వాలిఫయర్-2లో కొనసాగించాలనుకుంటుంది.

మరోవైపు చెన్నై చేతిలో క్వాలిఫయర్-1లో ఓడిన గుజరాత్.. క్వాలిఫయర్-2లో గెలిచి ఫైనల్ చేరాలనుకుంటుంది. దాంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. అయితే ఇరు జట్ల మధ్య హెడ్ హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే 2-1తో ముంబైదే పై చేయి. ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు జరగ్గా రెండింటిలో ముంబై గెలవగా.. ఒక్కదాంట్లో మాత్రమే గుజరాత్ విజయాన్నందుకుంది. ఈ ఏడాది జరిగిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లో చెరొకటి గెలిచాయి. అహ్మదాబాద్ పిచ్ పేస్ బౌన్స్‌తో పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. తేమ ప్రభావం ఏ మాత్రం ఉండే అవకాశం లేదు.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ఇషాన్ కిషన్(w), రోహిత్ శర్మ(c), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్

Advertisement

Next Story