IPL 2023: టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌..

by Vinod kumar |   ( Updated:2023-04-14 15:07:58.0  )
IPL 2023: టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీమ్‌కు తిరుగుండదు. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ లేని లోటును నితీశ్ రాణా తీరుస్తున్నాడు. బ్యాటింగ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ ఫామ్‌లో ఉన్నాడు. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ రింకూ సింగ్‌ సిక్సర్లు బాదేస్తూ భయపెడుతున్నాడు. ఓపెనింగ్‌ పరంగా ఇబ్బందులున్నాయి. స్టాండర్డ్‌ ఓపెనర్లు లేకపోవడం ఇబ్బందికర విషయం. మిడిలార్డర్‌లో వెంకీ, రాణా, రింకూ, రసెల్‌, నరైన్‌, శార్దూల్ భీకరంగా ఆడగలరు. ఆర్సీబీపై శార్దూల్‌ ఎలాంటి ఇన్నింగ్స్‌ ఆడాడో తెలిసిందే. స్పిన్‌లో కేకేఆర్‌కు తిరుగులేదు. మిస్టరీ స్పిన్నర్లు సునిల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి వికెట్లు పడగొడుతున్నారు.

మరోవైపు ఈ సీజన్‌లో ఆలస్యంగా ఫామ్‌లోకి వచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్‌. ఉప్పల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సత్తా చాటింది. అయితే హ్యారీ బ్రూక్స్‌ ఇంకా తన మెరుపులు చూపించలేదు. మయాంక్‌ నిలకడగా ఓపెనింగ్స్‌ ఇస్తున్నాడు. రాహుల్‌ త్రిపాఠి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. సిచ్యువేషన్‌ బట్టి స్లోగా.. అగ్రెసివ్‌గా ఆడుతున్నాడు. కెప్టెన్‌ అయిడెన్‌ మార్‌క్రమ్‌ రన్స్‌ చేస్తున్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జన్‌సెన్‌, భువీ పరుగులు బాకీ ఉన్నారు.

సరైన కండీషన్స్‌లో సన్‌రైజర్స్‌ బౌలింగ్‌కు ఎదురుండదు. భువీ మునుపటి స్థాయిలో భయపెట్టక పోయినా రన్స్‌ కంట్రోల్‌ చేస్తున్నాడు. జన్‌సెన్‌, మాలిక్‌, నట్టూ ఫర్వాలేదు. మయాంక్ మర్కండే పంజాబ్‌పై 4 వికెట్లు తీసి జోష్‌లో ఉన్నాడు. సుందర్ అతడికి తోడున్నాడు. పిచ్‌ను బట్టి జన్‌సెన్‌ స్థానంలో ఆదిల్‌ రషీద్‌ను తీసుకుంటారు. ఈడెన్‌ పిచ్‌పై సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ ఎఫెక్టివ్‌గానే ఉంటుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌దే పైచేయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 23 సార్లు తలపడ్డాయి. 14 మ్యాచుల్లో కేకేఆర్‌ విజయ ఢంకా మోగించింది. 8 సార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను విజయం వరించింది. ఒక మ్యాచ్‌ టై అయింది. ఆరెంజ్‌ ఆర్మీపై కేకేఆర్‌ విజయాల శాతం 63.04గా ఉంది.

పిచ్ రిపోర్ట్.. ఛేదన సులభం!

ఈడెన్‌ గార్డెన్‌ పిచ్‌ చాలా బాగుంటుంది. చాలా మంది క్రికెటర్లకు ఇది అచ్చొచ్చిన మైదానం. బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సాయపడుతుంది. ఈ పిచ్‌పై ఛేదన సులభంగా ఉంటుంది. రాత్రి పూట డ్యూ ఫ్యాక్టర్‌ ఎక్కువ.. బంతి గ్రిప్‌ అవ్వడం కష్టం. అందుకే టాస్‌ గెలవగానే నేరుగా బౌలింగ్‌ ఎంచుకుంటారు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 79 మ్యాచులు ఆడగా.. ఛేజింగ్‌ టీమ్‌ 47 సార్లు గెలిచింది. టాస్‌ గెలిచిన జట్టు 55 శాతం గెలిచింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

రహ్మానుల్లా గుర్బాజ్(w), N జగదీసన్, నితీష్ రాణా(c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(w), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

Also Read: IPL 2023: హార్దిక్ పాండ్యాకు జరిమానా.. కారణం అదే

IPL 2023: మరో ఆసక్తికర పోరు.. నేడు కోల్‌కతాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ

Advertisement

Next Story

Most Viewed