- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: ముంబై పిచ్‌పై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా వాంఖడే వేదికగా ఇవాళ ముంబై ఇండియాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ రెండింట్లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్‌కు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముంబై పిచ్‌పై ఆర్సీబీ బ్యాటర్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
"ముంబైలో ఆడటం తమ టీమ్‌కు కూడా చాలా ఇష్టమని.. మా ఆటతీరుకు ఈ స్టేడియం సరిగ్గా సరిపోతుంది. అలాగే ముంబై ఆటకు కూడా ఈ మైదానం బాగుంటుంది" అని చెప్పాడు. రెండు టీమ్స్‌కు సరిపోయే స్టేడియం కాబట్టి.. ఇది కచ్చితంగా చాలా ఎగ్జయిటింగ్ మ్యాచ్ అవుతుంది. అలాగే మంచి కాంపిటీటివ్‌గా ఉంటుంది. ఈ సీజన్‌లో మేం మంచి క్రికెట్ ఆడాం. కాబట్టి ఈ మ్యాచ్ కోసం కూడా అందరం ఎదురు చూస్తున్నాం' అని కోహ్లీ అన్నాడు. ఆర్సీబీ హెడ్ కోచ్ మైక్ హెసాన్ కూడా ముంబై పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ స్టేడియం తమ ఆటతీరుకు చక్కగా సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. ఇక్కడ కూడా చిన్నస్వామిలాగే డిఫెండ్ చేసుకోవడం కష్టమని.. గతేడాది పూర్తిగా ఇక్కడే ఆడామని గుర్తుచేశాడు. కాబట్టి ఈ పిచ్ గురించి అవగాహన ఉందన్నాడు.