- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: బట్లర్ అరాచకం.. పవర్‌ప్లే రికార్డు!
దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. పటిష్ఠమైన హైదరాబాద్ బౌలర్లకే చుక్కలు చూపించారు. పవర్‌ప్లే 6 ఓవర్లు ముగిసే సరికే వికెట్ నస్టానికి 85 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ విధ్వంసక ఆటగాడు జోస్ బట్లర్ (54; 22 బంతుల్లో 7x4, 3x6) అరాచకం సృష్టించాడు. క్రీజులో నిలబడి సిక్సర్లు దంచికొట్టాడు. భువనేశ్వర్, ఫజల్‌హక్ ఫారూఖీ, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్.. అతడి ముందు తేలిపోయారు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు దంచికొట్టడంతో చూస్తూ ఉండిపోయారు.
మరో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (32; 14 బంతుల్లో 6x4) సైతం బట్లర్‌కు తోడుగా చెలరేగాడు. అతడితో కలిసి తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం అందించాడు. వీరిద్దరి దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ 3.4 ఓవర్లకే 50 స్కోరు చేసింది. బట్లర్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు.