IPL 2023: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ప్లేయర్.. ఢిల్లీ ప్రాంఛైజీ షాకింగ్‌ నిర్ణయం

by Vinod kumar |   ( Updated:2023-04-27 17:01:20.0  )
IPL 2023: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ప్లేయర్..   ఢిల్లీ ప్రాంఛైజీ షాకింగ్‌ నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ప్లేయర్ ఒకరు తప్పతాగి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో విజయానంతరం ఢిల్లీ ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన పార్టీలో జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్.. అక్కడికి వచ్చిన ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లకు కఠిన నిబంధనలు జారీ చేసింది. ఎంతపెద్ద గెస్ట్‌లు అయినా.. ఫ్రాంచైజీ అధికారుల అనుమతి తీసుకునే ఆటగాళ్ల రూమ్స్‌కు వెళ్లాలని నిబంధన తీసుకొచ్చింది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కొన్ని నిబంధనలను ఆటగాళ్లకు పెట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు ఈ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సమాచారం. రాత్రి 10 గంటల తర్వాత బయటి వ్యక్తులు ఎవరూ కూడా ఆటగాళ్ల గదుల్లోకి వెళ్లడానిక వీల్లేదు. ఎవరైనా ఫొటో ఐడెంటిఫికేషన్‌తో ఆటగాళ్లను కలవాలి. టీమ్ హోటల్‌ను విడిచి వెళ్లడానికి ప్రతీ ఆటగాడు ఫ్రాంచైజీ అదికారుల అనుమతి తీసుకోవాలి. ఆటగాళ్ల సతీమణులు, ప్రియురాళ్లకు అనుమతి ఉన్నా.. వారి ఖర్చులను ఆటగాళ్లే భరించాలి. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణంగా విఫలమైంది. ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ మినహా మరే ప్లేయర్ రాణించడం లేదు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ తీసుకువచ్చిన నియమావళి ఇదే..

►రాత్రి 10 గంటల తర్వాత బయటి వ్యక్తులు ఎవరూ ఆటగాళ్ల గదుల్లో రాకూడదు.

►అతిథులను గదిలోకి ప్రవేశించాలంటే ఖచ్చింతంగా ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఐపీఎల్‌ టీమ్‌ ఇంటిగ్రిటీ ఆఫీసర్ నుంచి అనుమతి అవసరం

►హోటల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా ఫ్రాంచైజీకి తెలియజేయాలి.

►ఆటగాళ్ల సతీమణులు, గార్ల్‌ఫ్రెండ్స్‌కు అనుమతి ఉన్నా, వారి ఖర్చులను ఆటగాళ్లే భరించాలి.

►ఆటగాళ్లందరూ తప్పనిసరిగా ఫ్రాంచైజీ కార్యక్రమాలకు కచ్చితంగా హాజరు కావాలి

►నిబంధనలను ఉల్లంఘించిన ఆటగాళ్లపై కఠిన చర్యలు ఉంటాయి. కాంట్రాక్ట్‌ను కూడా రద్దు చేసే ఛాన్స్‌

Advertisement

Next Story