IPL 2023: నేడు హోం గ్రౌండ్‌లో లక్నోతో చెన్నై ఢీ..

by Vinod kumar |   ( Updated:2023-04-02 18:45:59.0  )
IPL 2023: నేడు హోం గ్రౌండ్‌లో లక్నోతో చెన్నై ఢీ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-16ను చెన్నయ్ సూపర్ కింగ్స్ ఓటమితో ప్రారంభించగా.. లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయంతో ఆరంభించింది. చెన్నయ్ వేదికగా నేడు ఈ రెండు జట్లు లీగ్‌లో తమ రెండో మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గి బోణీ కొట్టాలని చెన్నయ్ భావిస్తుండగా.. తొలి మ్యాచ్‌ గెలుపు జోష్‌తో లక్నో బరిలోకి దిగుతున్నది. ఓపెనింగ్ మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో చెన్నయ్ ఓడినా.. చివరి ఓవర్ వరకూ గెలుపు కోసం ప్రయత్నించింది. కాబట్టి, మరీ ఆందోళన చెందే అంశాలు తొలి మ్యాచ్ లోపాలను సరిదిద్దుకోవడం మేలు. గైక్వాడ్ భీకర ఫామ్‌లో ఉండటం జట్టుకు ప్రధాన బలం. భారీ అంచనాలు పెట్టుకున్న స్టోక్స్ విఫలమవడం జట్టును నిరాశపర్చింది.

అతనితోపాటు కాన్వే, మొయిన్ అలీ, జడేజా, దూబే రాణించాల్సిన అవసరం ఉన్నది. తొలి మ్యాచ్‌లో ధోనీ ఆఖర్లో మంచి షాట్లు ఆడి ఫినిషర్ రోల్ పోషిస్తానని చెప్పకనే చెప్పాడు. యువ బౌలర్ హంగర్గేకర్‌, దీపక్ చాహర్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నది. ఢిల్లీపై భారీ విజయం సాధించిన లక్నో అదే జోరును కొనసాగించాలనుకుంటున్నది. కైల్ మేయర్స్, కేఎల్ రాహుల్, పూరన్, స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోనితో బ్యాటింగ్ దళం పటిష్టంగా ఉన్నది. తొలి మ్యాచ్‌లో నిరాశపర్చిన రాహుల్ పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. బౌలింగ్‌లోనూ లక్నో బలంగా ఉన్నది. ముఖ్యంగా తొలి మ్యాచ్‌లోనే మార్క్‌వుడ్ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. అతనితోపాటు అవేశ్ ఖాన్, స్పిన్నర్లు రవి బిష్ణోయ్,గౌతమ్ మంచి ఫామ్‌లో ఉన్నారు.

Advertisement

Next Story