IPL 2023: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్..

by Vinod kumar |   ( Updated:2023-05-10 13:55:41.0  )
IPL 2023: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తమ సొంత స్టేడియలో మరోసారి ఆధిపత్యం చెలాయించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అవుతోంది. ఈ సీజన్‌లో చెపాక్‌లో ఆడిన 5 మ్యాచుల్లో మూడింట చెన్నై ఓడిన సంగతి తెలిసిందే. అయితే చివరగా ఇక్కడ ఆడిన మ్యాచ్‌లో ముంబైపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ క్రమంలో ఢిల్లీపై కూడా అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది.

వరుసగా రెండు పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయాన్నందుకున్న చెన్నై.. 6 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే చెన్నై చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలవాలి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎలాగైనా ఓడించాలని ఆ జట్టు భావిస్తోంది. మరోవైపు వరుస పరాజయాల తర్వాత పుంజుకున్న ఢిల్లీ 4 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే అంటే ఆ జట్టు ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

డేవిడ్ వార్నర్(c), ఫిలిప్ సాల్ట్(w), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(w/c), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

Advertisement

Next Story