IPL 2023 : ప్లే ఆఫ్‌కి చెన్నై.. ఢిల్లీపై సూపర్ విక్టరీ

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-20 13:52:47.0  )
IPL 2023 : ప్లే ఆఫ్‌కి చెన్నై.. ఢిల్లీపై సూపర్ విక్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై సూపర్ పర్ఫామెన్స్ తో భారీ విక్టరీ సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్ లో చెన్నై ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటారు. తొలుత చెన్నై నిర్దేశించిన 224 లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఢిల్లీ బ్యాటర్లు తడబడ్డారు. 9 వికెట్లు నష్టపోయి 146 మాత్రమే చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేవలం డేవిడ్ వార్నర్(86) మెరుగైన ప్రదర్శన చేసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. పృథ్వీ షా (5), ఫిలిప్ సాల్ట్ (3), యష్ దుల్ (13), అక్షర్ పటేల్ (15), హకీం ఖాన్, (7)చేయగా రసౌ, హన్నిచ్ నోర్ట్ జే, కుల్ దీప్ యాదవ్ డకౌట్‌గా వెనుతిరిగి నిరాశ పరిచారు. ఢిల్లీపై సూపర్ విక్టరీతో చెన్నై జట్టు ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి చేరుకుంది.

Advertisement

Next Story