- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెంగుళూరులో మొదలైన భారీ వర్షం.. ఆర్సీబీ అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్ (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024లో ఈ రోజు అత్యంత కీలకమైన మ్యాచ్ ఆర్సీబీ, చెన్నై జట్ల మధ్య జరగనుంది. ఈ సీజన్ కు సంబంధించి ఇప్పటి కలకత్తా, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్ చేరుకోగా మిగిలి నాలుగో స్థానం కోసం చెన్నై, ఆర్సీబీ జట్లు పోటీ పడుతున్నాయి. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్ చేరుతుంది. దీంతో ఇరు జట్ల అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే వాతావరణం ఈ మ్యాచ్ పై ప్రభావం చూపుతుందని ఇప్పటికే ఐఎండి హెచ్చరించింది. దీనికి అనుకూలంగానే.. ఈ రోజు ఉదయం నుంచి భారీ ఎండలు కొట్టగా.. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకొని పోయింది.
బెంగళూరు సిటీ, చిన్న స్వామీ స్టేడియం సమీపంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో చెన్నై, ఆర్సీబీ అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా ఈ వర్షం ప్రభావం.. ఆర్సీబీ అభిమానులకు భారీ షాక్ ను ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మ్యాచులో ఆర్సీబీ గెలిస్తేనే ప్లే ఆఫ్ చేరుకుంటుంది. లేదంటే 5వ పోజీషన్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే చిన్నస్వామి స్టేడియంలో ఇటీవల కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. గంటల తరబడి వర్షం పడినా.. 10 నిమిషాల్లో గ్రౌండ్ మొత్తం నీరు ఇంకిపోయేలా ఫీల్డ్ ను తయారు చేశారు. కాగా రాత్రి 9 లోపు వర్షం తగ్గినా.. పిచ్‌ను తయారు చేసి 20 నిమిషాల్లో మ్యాచ్ ను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వర్షం ఆగడం, మ్యాచ్ మధ్యలో పడకుండా ఉండాలని ఆర్సీబీ అభిమానులు ప్రార్థనలు మొదలు పెట్టారు.